లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -ధర్మపురి
ధర్మపురి కి పొతే యమపురి ఉండదు అని చెబుతుంటారు . రాష్ట్రము లో ప్రసిద్ది గాంచిన నరసింహ
క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ పట్టాన కేంద్రానికి
75 కి మీ దూరం లో ఉంది .
పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహ
స్వామి దేవాలయం , శ్రీ రామలింగేస్వరలయం , మసీదులు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి .అనాది నుంచి
శైవ,వైష్ణవ , ముస్లిమ ల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉంది . ఇక్కడ స్వామి వారు
యోగానంద నారసింహ స్వామి గ భక్తుల అబిస్టములు నేరవేరుస్తున్నాడు .
యమలోకం లో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద
గోదావరి లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం లో నివాసం ఎర్పర్చుకున్నట్లు
పురాణం గాథలు చెబుతున్నాయి .
ఆలయ ద్వారం కుడి వైపున యమ ధర్మరాజు విగ్రహం ఉంటుంది . యమ ధర్మరాజు ని దర్శించుకొని
నృసింహుడిని దర్శించుకోవడం ఆనవైతి . పూర్వం ధర్మవర్మ అనే రాజు ధర్మ ప్రవర్తుడై ప్రజలందరినీ
ధర్మ మార్గం లో నడిపించి నలుగు పాదముల ధర్మం తో ఈ క్షేత్రాన్ని పరిపలించినందుకు ధర్మపురి
ని పేరు వచ్చింది అని పురాణాలూ చేబుతునంయి