info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -అంతర్వేది




నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం అంతర్వేది. పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవొచ్చు . చాల పురాతనమైన ఆలయం లో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వెలసిన ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . సముద్రపు నీరు , గోదావరి నీరు రెండు విడి విడిగా పారుతుంటాయి. ఆ ప్రదేశాన్నే అన్న చెల్లల గట్టు అంటారు .


త్రేతా యుగం లో రావణబ్రహ్మ ను సంహరించి శ్రీ రాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి ని పొందడానికి ఈ క్షేత్రాన్ని ధర్సించాడని పురాణాలూ చెబుతున్నాయి . అలాగే ద్వాపర యుగం లో అర్జనుడు తీర్థ్ యాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం అన్త్రవేది . వసిష్ట మహర్షి కోరికపై శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని సమేతంగా వెలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ స్వామి వారి పశ్చిమ ముఖంగా వెలసి ఉన్నారు.


కృత యుగాన వసిష్ట మహర్షి కి ,విశ్వామిత్రుడికి పోరు జరిగింది . ఆ సమయం లో విశ్వామిత్రుడు తన మంత్ర బలం తో హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తవిలోచనుడి ని రప్పించి వసిష్ట మహర్షి కొడుకులు వంద మందిని చంపించాడట . పుత్ర శోకాన్ని బరించలేకపోయిన వసిష్ట మహర్షి నరసింహ స్వామి ని ప్రార్థిస్తూ తపస్సు చేసాడట . అప్పుడు స్వామి ప్రత్యక్షమై రాక్షసుడని సంహరించాడట . రక్తవిలొచనుడి కి ఒక వరం ఉంది . అతని శరీరం నుంచి చిందే రక్తపుబొట్టు ఎన్ని ఇసుక రేనువులై పుడితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు . అందుకే స్వామి వారు అతన్ని చంపే సమయం లో ఒక మాయాశక్తి ని సృష్టించి ఆ శక్తి తన నాలుకను చాచి రాకసుని రక్తపు బొట్టు కిందపడకుండా చేయడం తో నరసింహ స్వామి చక్ర ప్రయోగం చేసి రాక్షసుడిని సంహారం చేసాడు అని స్థల పురాణం చెబుతుంది .


ఆ మాయాశక్తి నేటికి అశ్వరుడంబిక (గుర్రలక్కమ్మగా) స్థానికుల పుజలన్డుకుంటుంది . కృత యుగం ఆరంబం లో బ్రహ్మ దేవుడు రుద్రయాగం చేయడానికి నీలకంటేస్వరుడి ని ప్రతిష్టించి యాగం పూర్తి చేసాడు అని స్థల పురాణం . అందుకే ఈ క్షేత్రం లో నీలకంటుడు క్షేత్రాపాలకుడిగా కొలువై ఉన్నాడు .






ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మాగా మాసం శుద్ధ దశమి నాడు లో స్వామి వారికి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ గ జరుగుతాయి .
---------------------
Route Map:-