info.manatemples@mail.com

+91 9866933582

అహోబిలం నరసింహ స్వామి దేవాలయం -అహోబిలం




నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్క్కటైన అహోబిలం నరసింహ స్వామి దేవాలయం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కి మీ దూరం లో ఉంది . నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన క్షెత్రమిదెనని స్థల పురాణం చెబుతుంది .


ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు.
హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు . బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది .


శ్రీ మహావిష్ణువు ఉగ్రనారసింహ అవతారం లో స్థంబం నుంచి ఉద్బవిన్చినట్లు చెప్పే స్థంబాన్ని కూడా అహోబిలం లో చూడవచ్చు . ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది. దిగువ అహోబిలం : లక్ష్మి నరసింహ స్వామి శాంతి మూర్తి ఆయె వెలసిన క్షేత్రం ఇది . శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.


ఎనిమిది కి మీ ఎత్తున కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . హిరణ్య కసపుడిని సంవరించి వికట హట్ట్ హాసాలు చేస్తూ అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి .
(1)జ్వాల నరసింహ స్వామి
(2)అహోబిల నరసింహ స్వామి
(3)ఉగ్ర నరసింహ స్వామి
(4)మాలోల నరసింహ స్వామి
(5)కారంజ నరసింహ స్వామి
(6)భార్గవ నరసింహ స్వామి
(7)యోగానంద నరసింహ స్వామి
(8)క్షత్రవట నరసింహ స్వామి
(9)పావన నరసింహ స్వామి
నవ నరసింహ అవతారాలు .


ప్రత్యేకా కర్యాక్రమాలు :
ఫాల్గుణ మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .
ప్రకృతి అందాలూ , గుట్టలు ,కొండలు ,వాటి మద్యలో నుంచి వచ్చే నిటి సెలయేరులు చూడాలంటే తప్పకుండ జీవిత కాలం లో ఒకసారి అయిన సందర్శించాల్సిన క్షేత్రం !!

.