శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -వేదగిరి
వేదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం చాల పురాతనమైన దేవాలయం . 15 వ శతాబ్దం లో నిర్మించన ఈ దేవాలయం నరసింహకొండ పైన వెలసిన దివ్య క్షేత్రం . ఈ దేవాలయాన్ని కశ్యప మహర్షి ప్రతిష్టించినట్లు ,సప్త మహర్షులు ఈ కొండ పైన యజ్ఞం చేసినట్లు బ్రహమపురణం వలన తెల్సుతుంది .
ఈ దేవాలయం ఇక్కడ ఉన్న చిన్న కొండపై ఉండుట వలన ఈ కొండను నరసింహకొండ అని పిలిచేవారు, ఈ కారణంగానే ఈ కొండ దిగువ భాగాన, కొండపైకి వెళ్లే మార్గంలో ఉన్న ఊరికి నరసింహకొండ అనే పేరు వచ్చింది.
నెల్లూరు కి 18 కి మీ దూరం లో పెన్నానదికి దక్షిణ తీరం లో వెలసిన ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ది చెందినా మహిమన్మితమైన క్షేత్రం . పెన్నానది, కొండ ప్రాంతం, అందమైన ప్రదేశాలు చూడముచ్చటగా ఉండి, భక్తులనే కాక ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకులను సైతం ఆకర్షిస్తూ పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంది.