info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం -సింహాచలం




విశాకపట్టననికి 16 కి మీ దూరం లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున గల కొండ పైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది . నవ నరసింహ క్షేత్రాల్లో ఇది ఒకటి . ఈ దివ్యక్షేత్రం ప్రహ్లాదుని భక్తికి, అతనిపై నరసింహస్వామివారికున్న దయకు నిదర్శనంగా నిలిచింది.


స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూత పూస్తుంటారు. నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.




ఈ దేవాలయాన్ని సుమారు 11 వ శతాబ్దమ లో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . ఈ క్షేత్రం సింహం ఆకారంలో ఉన్న కొండపై ఉండడం వల్ల దీనిని సింహాచలం అని పేరు వచ్చిందిని చెబుతారు. గర్భాలయం లో స్వామీ వారు వరాహ ముఖం , మానవాకారం ,సింహపు తోక కలిగి ఉంటారు . వరాహ -నరసింహ మూర్తుల సమ్మేళనం లో వెలసిన ఈ స్వామి ని సింహాద్రి అని పిలుస్తారు . ఈ గుడి ముఖ మండపం లో ఒక స్థంబం ఉంది . దానిని కౌగిలించుకొని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నేరువేరుతాయని భక్తుల విశ్వాసం . సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది.


మనోహరమైన శిల్పాలు, ప్రాకారాలు, అడుగడుగునా దర్శనమిస్తాయి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు సంవత్సరమంతా చందనంతో నిండి ఉంటారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే చందనం తొలగించిన స్వామివారి నిజస్వరూప దర్శనం కలుగుతుంది. స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగించే ఉత్సవాన్ని చందనోత్సవం అని పిలుస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకుల్లో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటారు.


వరాహ పుష్కరిణి

----------------------
ఈ పుష్కరాని కొండ క్రింద ఆడవి వరం గ్రామం లో ఉంది . ప్రతి సంవత్సరం పుష్యమాసం లో స్వామి వారు తన దేవేరుల సమేతంగా కొండ దిగి వచ్చి పుష్కరాని లో ఉన్న భైరవ స్వామి ని దర్శించి అనంతరం కొండ కి చేరి స్వామిని దర్శనం చేసుకోవాలని చరిత్ర చెబుతుంది .


వెళ్ళు మార్గం :
---------------
విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చును.