info.manatemples@mail.com

+91 9866933582

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం,మట్టపల్లి




నల్గొండ జిల్లా హుజూర్నగర్ తాలుక లో మట్టపల్లి క్షేత్రం లో కృష్ణ నది పరివాహక ప్రాంతం లో వెలసిన లక్ష్మి నరసింహ స్వామి ( యోగానంద లక్ష్మి నరసింహ స్వామి) దేవాలయం ఎంతో మహిమన్మితమైనది. ఆలయం లో స్వామి బక్తులకు ఎల్లప్పుడు ఆశిర్వాదాలను అందిస్తుంటారు .


పూర్వం బరాధ్వజది మహర్షులు శ్రీ నృశింహోపసన చేసిన తపోభుమి మట్టపల్లి క్షేత్రం.ఆ కాలం లో మహర్షులు ,దేవతలు మాత్రమే గుహ గర్బ మందలి స్వయం వ్యక్త శ్రిముర్తిని సేవిస్తూ ఉండేవారు . కలియుగం లో కృష్ణ నదికి అవాలి తీరమున సమిపమునందు గల తంగేడు జనపదమును పరిపాలిస్తున్న మాచిరెడ్డి అనే భాగవత ప్రబువు కు స్వామి కలలో కనిపించే నేను ఈ ప్రాంతమందే ఉన్నాను దానిని వెతికి ఆలయం కట్టమని చెప్పి సేలువిచ్చాడట .


మాచిరెడ్డి ప్రభువు ఎంత వెతికినా దొరకకపోవడం తో స్వామి వారు కలలో సమీపం లోనే నికోక అరచెట్టు ,దాని పైన గరుడ పక్షి కనబడుతుంది దానికి సమీపం లో గుహల ఉన్నాను అని చెప్పాడట. ఉదయమునే లేచి స్వప్ననుసారం గుహను గుర్తించి స్వామి వారికి ఆలయం నిర్మించి పూజ అభిశెకములు గావించి జీవితం చరితార్థం చేసుకున్నాడు అని పురాణం !!


స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట .
ప్రత్యేక కార్యక్రామాలు :
వైకుంటా ఏకాదశి కి ,నరసింహ జయంతి కి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడును .