లక్ష్మి నృసింహ ,ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం -సింగరాయకొండ
ప్రకాశం జిల్లాలోని అద్దంకి దగ్గరలో ఉన్న సింగరాయకొండ లో లక్ష్మి నృసింహ స్వామి ,ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయాలు కొలువయి ఉన్నాయ్ . సింగర కొండ పైన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ,కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉంది .
ఈ దేవాలయాన్ని 14 వ శతాబ్దం లో నిర్మించారు అని శాసనాలు చెబుతున్నాయి . సింగన్న అనే ఒక బక్తుడు ఒక రాయి లో నృస్మిహ అవతరాన్ని బాలుని రూపం లో చూసి అక్కడే దేవాలయాన్ని నిర్మించాడట .
దేవాలయం నిర్మాణం ఉన్న సమయం లో కొండ కింద చెరువు దగ్గర ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిస్తిన్చారట అక్కడే గ్రామస్థులు దేవాలయాన్ని నిర్మించారు అదే ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం . దేవాలయ నిర్మాణం అంతా వాస్తు శాస్త్ర ప్రకారంగా నిర్మించబడినది చెబుతారు.
స్వామి వారికీ ప్రతి నిత్యం విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .ప్రతి సంవత్సరం నరసింహ జయంతి కి,హనుమాన్ జయంతి ఘనంగా పూజ కార్యక్రమలు నిర్వహిస్తారు . పాల్గుణ మాసం లో స్వామి వారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి .