లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -పాలెం
సూర్యాపేట నుండి కోదాడ వెళ్ళే మార్గం లో మొదుల చెరువు నుండి 5 కి మీ దూరం లో గల రెపాల గ్రామం లో వెలసిన నరసింహ క్షేత్రం చాల పురాతనమైనది .సుమరు 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది .
చిన్న గుట్ట పైన వెలసిన ఈ దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైనది మరియు మహిమన్మితమైన క్షేత్రం. పాల్గుణ మాసం లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి . ఈ క్షేత్రం మునగాల కి దగ్గరలో ఉంటుంది .
జీవితం లో ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించాల్సిన క్షేత్రం ఇది . వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించి స్వామి వారి కృప కటక్షలు పొందాల్సిందే!
స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట .
ప్రత్యేక కార్యక్రామాలు :
వైకుంటా ఏకాదశి కి ,నరసింహ జయంతి కి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడును .
వెళ్ళు మార్గం :
సూర్యాపేట నుండి కోదాడ వెళ్ళే మార్గం లో మొదుల చెరువు నుండి 5 కి మీ దూరం లోఈ క్షేత్రం ఉంటుంది .