సిన్గోటం లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం –సిన్గోటం
మహబూబ్ నగర్ జిల్లా లోని కొల్హాపూర్ పట్టణానికి 10 కి మీ దూరం లో సింగొటం గ్రామం లో
వెలసిన క్షేత్రం సిన్గోటం లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం .
స్థల పురాణం :-
----------------
900 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . అప్పట్లో సురభి వంశస్తుడైన సింగమ నాయుడి కాలం
లో ఈ దేవాలయం నిర్మించబడింది . ఒక రైతు పొలం గట్టు దగ్గర దున్నుతుండగా నాగలికి షీలా
అడ్డు తగిలింది దాని తొలిగించి గట్టు పైన ఉంచాడు . మారనాడు మల్లి దున్నుతుండగా షీలా
కి అడ్డు తగలింది . ప్రతి రోజు ఇలా జరుగుతుండడం చూసి రైతు బయపడిపోయాడు . సింగమ నాయుడు
కి కలలో దర్శనం ఇచ్చి రైతు గుర్తించలేదు అని నువ్వు వెళ్లి సూర్యోదయానికి ముందే దాన్ని
ప్రతిస్టించమని స్వప్నం లో చెప్పగా అతను వెళ్లి దాన్ని ప్రతిస్టించాడు అన్ని అప్పట్నుంచి
క్షేత్రాన్నిసిన్గోటం స్వామి అని కూడా అంటారు . ఇక్కడ స్వామి వారు లింగాకృతి లో కొలువై
ఉన్నారు .
అందుకే ఈ క్షేత్రాన్ని శివ -విష్ణు క్షేత్రం అని కూడా పిలుస్తారు . లింగాకారం లో గల
ఈ స్వామికి ప్రతి సోమ,శనివారాల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తారు .
ఈ క్షేత్రం నుంచి 1 కి మీ దూరం లో గల రత్నగిరి గుట్ట పైన రత్నలక్ష్మి దేవి కొలువై ఉన్నారు
. సంక్రాంతి సమయం లో తిరునాళ్ళు జరుగుతాయి . వేరే రాష్ట్రాల్లో నుండి కూడా భక్తులు
ఉత్సవాలకు వస్తారు . సమీపం లో గల గుండం లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటారు
.
వెళ్ళు మార్గం :- కొల్హాపూర్ నుండి సిన్గోటం కి TSRTC బస్ సర్వీస్ లో ఉంటాయి. ఆటో లు
కూడా చాల తిరుగుతూ ఉంటాయి.
Route Map:-