info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ సాక్షి బావ నారాయణ స్వామి దేవాలయం,ఆంజనేయ స్వామి దేవాలయం - పొన్నూరు




హరి హర విబెధాలకు ముందుగ వెలసిన ప్రాచిన క్షేత్రాల్లో సాక్షి భావనారాయణస్వామి దేవాలయం ఒకటిగుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం (30 km ) లో వెలసిన అతి ప్రాచిన మహిమన్మితమైన, శక్తివంతమైన క్షేత్రం క్షేత్రం ఇది . శ్రీ మహా విష్ణువు కాశి క్షేత్రం నుంచి ఇక్కడకి వచ్చి ఇక్కడ కోలువైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది .


పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని, "పొన్నూరు"(పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. తమిళంలో "పొన్ను" అంటే బంగారం అని అర్థం. పొన్ను+ఊరు, అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది.


ఆలయం లో బ్రహ్మ సరోవరం వెలసి ఉంది ,ఇక్కడ బ్రహ్మ దేవుడు గోస్టివనం లో తపస్సు చేసిన సమయం లో ఈ సరోవరం లో స్నానం చేసేవారు అని పురాణాలు కథనాల ద్వార తెలుస్తుంది. స్వామి వారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు దర్శనం ఇస్తాడు . ఆలయానికి ప్రక్కనే చెన్న కేశవా స్వామి ఆలయం కొలువై ఉంది . బ్రహ్మ ,విష్ణువు,శివ దేవత లు కొలువైన ప్రదేశం. ఒక భక్తుడికి సాక్ష్యం చెప్పడానికి స్వామి వారు దివి నుండి భువి కి దిగి వచ్చి ఇక్కడ కొలువయ్యారు అని అందుకీ ఈ క్షేత్రానికి సాక్షి భాయనారాయణ స్వామి ఆలయం గ పేరు వచ్చింది అని పురాణం గాథ .
రాజ బసిరెడ్డి కాలం లో ఈ దేవాలయం బాగా అభిరుద్ది చెందింది అని శాసనాల ద్వారా తెలుస్తుంది .
ఈ క్షేత్రం లో రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి విగ్రహాలు ,నరసింహ స్వామి ,ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి .


ఈ ఆలయప్రాంగణమున ఉన్న ఇతర ఆలయాలు
1. రాజ్యలక్షీ అమ్మవారి ఆలయం.
2.శ్రీ కాశీవిశ్వేశ్వరాలయము.
3.శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయo.



కాశి విశాలాక్షి దేవాలయం లో ప్రతి ఏట మహా శివరాత్రి పర్వదీనన కల్యాణోత్సవం జరుగుతుంది . సాక్షి భావ నారాయణ స్వామి ఉత్సవాలు(తిరునాళ్ళు) వైశాక మాసం లో కనుల పండుగ గ, శోబయమానంగా జరుగుతాయి . చూడడానికి ఎక్కడెక్కడో నుండి భక్తులు వస్తారు.







శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానం
సహస్ర లింగేశ్వర ఆలయం 1961 లో నిర్మితమైనది. 5 లింగాలను శివుడి పాదాలదగ్గర ప్రతిష్టించడం జరిగింది . నల్లటి శీలా పైన అమ్మ వారి రూపం దర్శనం ఇస్తుంది. 5 అకండ దీపాలు ఉంటాయి ఈ క్షేత్రం లో . ఆలయ గోడల పైన అద్బుతమైన శిల్పాలు ,దేవాలయ చరిత్ర ను రాయడం జరిగింది . ఆలయం లో వివిధ రకాల దేవత మూర్తులు కొలువై ఉన్నారు.



ఆంజనేయ స్వామి దేవాలయం:
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందినా ఆంజనేయ క్షేత్రాల్లో చాల ప్రాముక్యత గల దేవాలయం పొన్నూరు ఆంజనేయ స్వామి దేవాలయం . ఈ దేవాలయం లో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతస్వామి ల విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఈ విగ్రహాలు 24 అడుగుల ఎత్తు 30 అడుగుల ఎత్తుతో నయనానందకరముగా కనిపిస్తూ బహుళ ప్రసిద్ధికెక్కినవి.

ఆలయం లో ఉన్న మహిమన్మితమైన హనుమ గ్రహ పీడలను ,దుస్త శక్తులను తోలిగిస్తాడని భక్తుల విశ్వాసం. స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు .

ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . మంగళ ,శని వారాల్లో ప్రత్యేకమైన పూజలు ఉంటాయి .