info.manatemples@mail.com

+91 9866933582

వేద నారాయణ స్వామి దేవాలయం -నాగులాపురం





చిత్తూర్ పట్టణానికి సమీపం లో నాగులాపురం గ్రామం లో వెలసిన మహా విష్ణువు క్షేత్రం వేదనారాయణ స్వామి దేవాలయం . శ్రీ కృష్ణ దేవరాయలు తన తల్లి జ్ఞాపకార్థంగా కట్టించిన ఈ దేవాలయం లో వేదనారాయణ స్వామి విగ్రహం శ్రీదేవి ,భూదేవి సమేతంగా ఉత్తరం వైపు కనిపిస్తూ ఉంటుంది .

శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.

ఇక్కడ ఫాల్గుణ మాసం శుద్ద ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.జేష్ఠ మాసంలొ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
• వైకుం ఏకాశి
• ఆండాళ్ళ నీరోత్సవం
• భోగి
• సంక్రాతి
• కనుమ
• రథసప్తమి
• కంచిగరుడసేవ
పండుగలప్పుడు విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .

dev_rajoli dev_ponnur dev_nagulapuram dev_sarpavaram