చేన్నకేశవా స్వామి దేవాలయం -గంగాపురం,జడ్చెర్ల
కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు
ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం,
మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ
కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి ...
మహాబూబనగర్జ జిల్లాలోని జెడ్చెర్ల కి 6 కి మీ దూరం లో వెలసిన మహిమన్మితమైన దివ్య క్షేత్రం లక్ష్మి చెన్న కేశవా స్వామి దేవాలయం . మన రాష్ట్రము లో ఉన్న లక్ష్మి చెన్న కేశవ స్వామి ఆలయాల్లో ఎంతో ప్రసిద్దిగాంచిన దేవాలయం ఇది .
ఈ క్షేత్ర మహత్యాన్ని స్కాందపురాణం లోని తీర్థకండం లో పేర్కొనడం జరిగింది . ఈ ప్రాంతానికి మత్స్యపురి, దురితకోలహలం, మాయాపురి, గంగాపురం అని నాలుగు యుగాల్లో నాలుగు పేర్లు ఉన్నాయి అని చెబుతారు . పూర్వం ఈ ప్రాంతాన్ని పారిపలించిన దేవసేనుడు అనే రాజు ఈ ప్రాంతం లో నిల్లు లేకపోవడం తో హిమాలయాలకు వెళ్లి గంగమ్మ కోసం తపస్సు చేయగా ఆ తల్లి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోనమనగా నా వెంట వచ్చి మా పట్టణము నందు ప్రవహించమని కోరగా అమ్మ వారు అంగికరించి ఈ ప్రాంతం లో ప్రవహించినది అని అందుకే దానికి దేవసేన నది అని పేరు వచ్చినది అని స్థల పురాణం . ఆ నదిమ తల్లి పేరిట ఈ ప్రతానికి గంగాపురం వచ్చింది అని చెబుతారు .
చాళుక్యులు కాలం లో నిర్మించన ఈ దేవాలయం ఎంతో అద్బుతంగా ఉంటుంది . అద్బుతమైన శిల్పకళ ,కట్టడాలు ఎంతో రమణీయంగా ఉంటాయి . ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజ కార్యక్రమాలు విశేషంగా ఉంటాయి . ప్రతి శనివారం ప్రత్యేక పూజలు ,రాత్రి పుట గ్రామోత్సవం (ఊరేగింపు సేవ ) జరుగుతాయి .
ఆలయ ద్వారాలు ,ఆలయ ఆవరణ లో ఉన్న మండపాలు చాల చూడచక్కగా ఉంటాయి . ఆలయ ఆవరణ లో ఆంజనేయ స్వామి దేవాలయం కలదు . సుమారు 60 సంవత్సరాల క్రితం ప్రతిష్టించినట్లు శాసనాల ద్వార తెలుస్తుంది .
ప్రత్యేక కార్యక్రమాలు :-
గంగ తిరునాళ్ళు (గంప జాతర) ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసం లో చివరి శనివారం జరుగుతుంది .
మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి .