info.manatemples@mail.com

+91 9866933582

కాలభైరవ స్వామి దేవాలయం




మనిషిలోని " నేను " అనే అహంకారానికి బ్రహ్మ అని పేరు. కాలభైరవత్వం ఈ అహంకారాన్ని పోగొడుతుంది . అలా బ్రహ్మ దేవుడి అహంకారాన్ని బంగం చేసిన వాడు కాలబైరవుడు . కాల భైరవుడు శివుడి నుంచి ఉద్బావిన్చినావాడు. నా అంతా వాడు లేడు అని విర్రవిగాకుడదని కాలభైరవ కథ చెబుతుంది .


నిజామాబాదు జిల్లా కామారెడ్డి పట్టాన సమీపం లో (8 కి మీ దూరంలో) వెలసిన ఈ క్షేత్రం అతి పురాతనమైనది అని చెబుతారు .


16 వ శతాబ్దం లో కాశీ నుంచి స్వామి వారి విగ్రహాన్ని ఎడ్లబండి పై తీసుకొస్తున్నారు . ఈ ప్రాంతం రాగానే రాత్రి అయ్పోయిందట . దాంతో అక్కడే విశ్రమించారు . తరువాత బారి శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం నిటారుగు నిలాబడిందట.ఆ ప్రదేశం లోనే ఆలయం నిర్మించారని స్థలపురాణం.
ఈ ఆలయం లో శునకాన్ని వాహనంగా చేసుకున్న ఎనిమిది అడుగుల కాలబైరవ స్వామి మూలా విగ్రహం కనిపిస్తుంది . కార్తిక మాసం లో ఇక్కడ స్వామి వారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు . ఆలయ ప్రాంగానం లోనే ఈ మద్య కాలం లో శనీశ్వరాలయం నిర్మించారు . అనారోగ్యం తో బాధపడే వారు ఇక్కడకి వచ్చి స్వామి వారి ఆశీస్సులతో అరోగ్యవంతులు అవుతారని విశ్వాసం !!
వెళ్ళు మార్గం :-

కామారెడ్డి పట్టాన సమీపం లో (8 కి మీ దూరంలో)