శ్రీ సీతరామచంధ్రస్వామి ఆలయం – శిరుసనగాండ్ల
మహబూబ్నగర్ జిల్లాలోని శిరుసనగాండ్ల గ్రామం లో వెలసిన పురాతన శ్రీ సీతా రామ క్షేత్రం ఇది . దత్తాత్రేయ మహర్షి కి ఇచ్చిన కోరిక మేరకు శ్రీ రామ చంద్రుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అని స్థల పురాణం చెబుతుంది . కల్వకుర్తి నుండి దేవరకొండ వెళ్ళే మార్గం లో చరగొండ గ్రామానికి సమీపం లో క్షేత్రం కొలువై ఉంది .
గ్రామానికి పశ్చిమ దిశలో కొండ పైన వెలసిన ఆలయం ఇది . 300 అడుగుల ఎత్తులో 70 ఎకరాల విస్తిరణం లో కొలువై తీరిన సీత రామచంద్ర స్వామి ఆలయం . 13 వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో దేదిప్యామానంగా వెలుగొందుతుంది . గర్భాలయ పైన వివిధ రకాల శిల్పాలు చెక్కబడ్డాయి .
శతాబ్దాల చరిత్ర గల దేవాలయం ఎంతో ఆహాలదకరంగా ,ప్రశాంత వాతావరణం లో ఉంటుంది .
దివ్యమైన ఆలయ మండపం ,మూడు అంతస్తులతో గాలి గోపురం,ఆలయం ఎదురుగా ఉన్న ద్వజస్తంబం ఎంతో ఆకట్టుకుంటాయి .
గర్భాలయం లో ఉన్న శ్రీ సీత రామచంద్ర లక్ష్మణ విగ్రహాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవ అన్న విదంగా ఉంటాయి . ఈశ్వరుడు క్షేత్రపాలకునిగా వెలసిన దివ్యామైన క్షేత్రం ఇది
ఉపలయాలు ఉన్నాయి
రామలింగేశ్వర దేవాలయం
ఆంజనేయ స్వామి దేవాలయం
నవగ్రహ దేవాలయం
దత్తాత్రేయ స్వామి మందిరం
మైసమ్మ దేవాలయం
ప్రత్యేక కార్యక్రమాలు :
శ్రీరామ నవమి కి ఘనంగా ఉత్సవాలు నిర్వహించాబడుతాయి .స్వామి వారి కల్యాణోత్సవం ,రతొత్సవమ్ ఘనంగా జరుగుతాయి . ఉత్సవాల సమయం లో చాలామంది భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరు దర్సిన్చానీయమైన క్షేత్రం ఇది .