శ్రీ పరశురామ స్వామి ఆలయం, తిరువల్లం
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది.త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు అని కూడా అంటారు.మన దేశం లో పరుశురామ దేవాలయాలు చాలా అరదు అలాంటిది మనకు కేరళలోని తిరువనంతపురం తిరువల్లం సమీపంలో కరమన నది ఒడ్డున కొలువై ఉంది .
తిరువల్లం శ్రీ పరశురామ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి.ఈ దేవాలయాన్ని 12-13 వ శతాబ్దం లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది . పరశురాముడికి అంకితం చేసిన కేరళలోని ఏకైక ఆలయం ఇది. ఈ దేవాలయం వారసత్వ నిర్మాణం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాల జాబితాలో ఉంచబడింది. ఇ ఆలయం తీరం లో పితృదేవతలను పూజించడం వలన యెంతో పుణ్యం లబిస్తుంది అని చెబుతారు.
స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.
ఏలా వెళ్ళాలి :-
ఈ ఆలయం కోవళం బీచ్ నుండి 6 కిలోమీటర్లు మరియు త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 5 కిలోమీటర్లు మరియు తిరువనంతపురం నుండి 3 కిలోమీటర్లు దూరం లో ఉంది .
Route Map : -