info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయం –మురామళ్ళ




గౌతమీ నది తీరాన ఉన్న సుప్రసిద్దమైన క్షేత్రం ఇది . తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఉన్న మురమళ్ళ గ్రామం లో వెలసిన వీరేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినది . భద్ర ఖాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఇది . ప్రతి రోజు ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది .


దక్షయజ్ఞం ద్వంసంగావించి తదుపరి మహావిష్ణువు కోరిక పై దక్ష యాగం పుర్తిగావించుటకు సమ్మతించి దక్షుని మొండెమునకు గొర్రె తలను తగిలించి దక్షుని బ్రతికించి ఆయన చేత వేదోక్తముగా యజ్ఞమును పూర్తి చేయించిన తారువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడలేదు . దేవతలందరూ గ్రహించి శ్రీ వీరభద్రుని శాంతింప చేయుటకై వైకుంటమునకు వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్తించి శాంతింప చేయమని కోరిరి . మహా విష్ణువు నరసింహ అవాతరం దాల్చి వీరభద్రుని శాంతింప చేయుటకు ప్రయత్నించిన పలితం కలగలేదు .


అప్పుడు మహా విష్ణువు జరిగినదంతా బ్రహ్మ లోకమునకు వెళ్లి బ్రహ్మ కు చెప్పగా అప్పుడు త్రిమూర్తులు ఆది పరాశక్తి ని ధ్యానించి గ షోడ కళ లో ఒక కళ ను భాద్రకాళి నామము తో భూలోకమునకు పంపి వీరభాద్రున్ని శాంతింప చేయుటకు ప్రయత్నించిన వీరభద్రుడు శాంతింప నందున అప్పుడు భద్రకాళి ప్రక్కనగల తటాకమునందు మునిగి భాద్రాకాలి స్వరూపం నుండి కన్య రూపమును దాల్చి వీరభద్రుడి ముందు నిలువగా అప్పుడు వీరభద్రుడు శాంతి అయ్యాడు అని అప్పుడు వారీరువురికి గందర్వ వివాహ పద్దతిన కాల్యణం జరిపించారు అని స్థల పురాణం .



ఆ నాటి నుండి స్వామీ వారికి గందర్వ పద్దతిలోనే కల్యాణోత్సవం జరిపిస్తారట !! అందుకే ఈ క్షేత్రం లో పెల్లిలు కాని వాళ్ళు కల్యాణోత్సవం జరిపిస్తే తొందరగా పెల్లిలు జరుగుతాయని భక్తుల నమ్మకం .


ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మహా శివరాత్రి ఉత్సవాలు ,స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు


వెళ్ళు మార్గం
---------------------
అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది.
రాజముండ్రి నుండి సుమారు 71 కి మీ దూరం ఉంటుండు ( ద్వారపూడి-యానం రోడ్ )