info.manatemples@mail.com

+91 9866933582

సత్యనారాయణ స్వామి దేవలయం -గూడెం గుట్ట




తెలంగాణా రాష్ట్రం లో వెలసిన ప్రసిద్దిగాంచిన సత్యనారాయణస్వామి దేవలయం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లో నది తీరమున గల గూడెంగుట్ట గ్రామం లో వెలసింది.

సుమారు 35 సంవత్సరాల క్రిందట గ్రామం లోని ఒక భక్తుడికి స్వామి వారు స్వప్నం లో కనిపించి నేను మీ గ్రామనికి సమీపం లో కొండ పైన వెలసి ఉన్నాను అని చెప్పాడు అట . కాని ఆ భక్తుడు అది స్వప్నమే అనుకోని ఉరుకున్నాడట. మరు నాడు కూడా స్వామి మల్లి స్వప్నం లో కనిపించగా అప్పుడు ఆ భక్తుడు స్వామి వారు వెలిసిన స్థలాన్ని వెతకడం ప్రారంబించాడు కాని అది ఎంత కు దొరకగా పొగ అప్పుడు స్వామి వారిని వేడుకోగా ఆ స్థలాన్ని గురుంచి తెలిపారట . అప్పుడు కొండ పైకి వెల్లలి వెదకగ ఒక చిన్న గుహ లో స్వామి వారి విగ్రహం దర్శనమిచ్చింది అట . భక్తుడు గోదావరి నది లో స్నానం అచారించి స్వామి వారికి పూజ కార్యక్రామాలు ,అభిషేకాలు నిర్వహించాడట

ప్రతి రోజు చాల మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటారు . కార్తిక పౌర్ణమి నాడు నది స్నానం అచారించి వ్రతాన్ని చేసుకుంటారు .

అయుదు పౌర్ణమి దినములు గాని ,11 పౌర్ణమి దినములు గాని కొండకు వచ్చి స్వామి ని సేవించి వ్రతం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం . మాఘ శుడా ద్వాదశి రోజున శ్రీ స్వామి వారి కల్యాణోత్సవం ,రాతోత్సవం మొదలగు కార్యక్రామాలు నిర్వహించాబడుతాయి