info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ జోగులాంబ బాలభ్రమేస్వర స్వామి దేవస్థానం - ఆలంపూర్


జోగులంభా మహాదేవి రౌద్రవీక్షణ లోచనా ! అలంపురి స్తితామాతా సర్వార్థఫల సిద్ధిదా !!



అష్టాదశ శక్తి పీట ల లో 5వ ది ఆయన శ్రీ జోగులాంబ అమ్మ వారి దేవాలయం పాలమూరు జిల్లా లో ఆలంపూర్ గ్రామం లో వెలసింది. 6 నుండి 12 శతాబ్దాల వరకు భారతీయ వాస్తు శిల్పాలలో కలిగిన పరిణామాలను తెలియ చేయు అనేక దేవాలయాలు ఉన్నయి. .


ఈ ప్రాంతాన్ని శాతవాహనులు ,ఇక్ష్యాకులు ఆదారించారు .తుంగబ్రది నది తీరాన వెలసిన దివ్య క్షేత్రం చూడడానికి ఎంతో అద్బుతంగా ఉంటుంది .ఈ క్షేత్రం లో జోగులంభ అమ్మ వారి తో పాటు ,నవ బ్రహ్మ దేవాలయాలు కూడా కలవు. చాలుక్యుల కాలం లోనే నవ బ్రహ్మ ఆలయాలను నిర్మించారు అని చారిత్రక ఆదారాలు చెప్తున్నాయి . ప్రసిద్దమైన శైవ క్షేత్రం దీనినే బ్రహ్మేశ్వర క్షేత్రమని , పరుశారమ క్షేత్రమని , దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు . శ్రీశైలం కు పడమరా ద్వారం అని కూడా పిలుస్తారు .


నవ బ్రాహ్మలు ఇక్కడ కొలువై ఉన్నారు . తారక బ్రహ్మ,స్వర్గ బ్రహ్మ ,పద్మ బ్రహ్మ ,బాల బ్రహ్మ ,గరుడ బ్రహ్మ ,కుమార బ్రహ్మఅర్క బ్రహ్మ,వీర బ్రహ్మ ,విశ్వ బ్రహ్మ లు కొలువై ఉన్నారు




ఆలంపూర్ దేవాలయం కర్నూల్ పట్టణానికి 27 కి ము దూరం లో ఉంది . !!






వెళ్ళే మార్గం : హైదరాబాద్ -కర్నూల్