info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -పాలకుర్తి




జనగాం జిల్లాలోని స్టేషన్ ఘనపురం నుండి 23 కి మీ దూరం లో పాలకుర్తి మండల కేంద్రం లో గల క్షీరగిరి (పాలకుర్తి) సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం నందు లింగము స్వయం భు గ్రామమున వెలుపల నున్నది , పర్వాతగ్రముపై ఉన్నది .సోమేశ్వర స్వామి ని దర్సిన్చుకున్నవారికి కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం .


శివ పంచాయతన క్షేత్రం ఆయన ఇక్కడ శివుడు సోమేశ్వర స్వామి గ విష్ణువు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి స్వయం భు లు గా రెండు పర్వత గుహలయందు వెలసి ఉన్నారు . శ్రవణ మాసం లో ఇక్కడ ఆయదు రోజులపాటు ( పంచాహ్నికదీక్షతో ) శ్రీ సోమేశ్వరస్వామి వారికి లక్ష బిల్వార్చన , అమ్మవారికి లక్ష కుంకుమార్చన ,శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి లక్ష తులసి అర్చన మరియు లోక కల్యానర్తమై రుద్రస్వాహకారపుర్వక శత చందియాగము కార్యక్రామాలు జరుగుతాయి .


" విశ్నుపాదోదభావిం గంగాం " అను ఆర్యోక్తి మేరకు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయ గుహ నందు ఉద్బవించే నిటి పాయకొండ్ పై గల కోనేరు నుండి అంతర్వాహినిగా సాగి ఈ గ్రామం చేరువునండు కలిసి అది పాలేరు గ మారి చివరకు గోదావరి నది యందు సంగమిస్తుంది .


పాలేరుకు జన్మస్థలమైన ఈ క్షేత్రం పాలకుర్తి గ వెలుగొందుతుంది . ఇచ్చటి శ్రీ సోమేస్వరస్వామిని సేవించిన వారికి మాములుకన్నా లక్ష రెట్లు అధిక ఫలం లబిస్తుంది అని చెబుతారు .