శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం,రామేశ్వరం(రాయకల్ గ్రామం),షాద్ నగర్
ఉత్తర రామేశ్వరం గ పేరుగాంచి న ఈ క్షేత్రం షాద్నగర్ పట్టణానికి అతి సమీపం లో గల రాయకల్ గ్రామా శివారులో వెలసిన ఈ క్షేత్రం లో స్వయానా శ్రీ రాముడే ఈ లింగాన్ని ప్రతిష్టించాడని పురాణ గాథ !!
మహబూబ్ నగర జిల్లా ఫారుకనగర్ మండల కేంద్రం లో గల షాద్నగర్ పట్టణం నుంచి సుమారు 10 కి మీ దూరం లో గల రాయికల గ్రామం లో వెలసిన రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది మరియు ఎంతో మహిమన్మితమైన క్షేత్రం .
సీతాన్వేషణ లో ఉన్న రాముడు దండకారణ్యం లో ప్రయాణిస్తూ శివలింగాన్ని ప్రతిస్టించాడు అని స్థల పురాణం .!!అందుకు ఆదారాలు మాణిక్య ప్రభు పురాణం లో ఆదారాలు ఉన్నాయి అని చెబుతారు .
బదిరి వృక్షం క్రింద పూజలు చేసినట్లు పురాణం లో ఉందని చెబుతారు . రాముడు ప్రతిష్టించిన శివలింగం కాల గర్భంలో కలిసిపోగా మాణిక్య ప్రభు శిష్యుడు అనంతరకాలం లో ఈ క్షేత్ర సమీపం లో తపస్సు చేసుకుంటుండగా శ్రీ రాముడు స్వప్నం లో దర్శనం ఇచ్చి శివలింగం ఉన్న చోటు చెప్పి పూజలు జరపాలని చెప్పినట్లు స్థలపురాణం చెబుతుంది .
రామేశ్వరం వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటే రామేశ్వరం వెళ్ళినంత పుణ్యం వస్తుంది అని చెప్తుంటారు !! ఆలయ సమీపం లో ఉన్న పుష్కరిణి లో స్నానమాచరిస్తే సకల రోగాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం .
ఆలయానికి సమీపం లో ఉన్న పార్వతి అమ్మవారి దేవాలయం ,ఆలయం లో ఉన్న శ్రీ మహాగణపతి ,సుబ్రమన్యెశ్వర స్వామి విగ్రహాలు చూడ చక్కగా ఉంటాయి . గర్భాలయం లో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం కొంచెం పెరుగుతుంటుంది అని చెబుతారు .
ప్రత్యేక పూజలు : -
ప్రతి సంవత్సరం మహా శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి . స్వామి వారికి కల్యాణోత్సవం ,అగ్నిగుండలు విశేసమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .
అభయ ఆంజనేయ స్వామి దేవాలయం -చౌడమ్మగుట్ట
షాద్నగర్ కి అతి సమీపం లో ఉన్న క్షేత్రం లో అభయ ఆంజనేయ స్వామి ఎంతో మహిమన్మిథమైనది మరియు శక్తివంతమైనది . కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం స్వామి . తవ్వకాల్ల శ్రీ రామ విగ్రహం లబించగా దానిని ఇక్కడ ప్రతిష్టించారని ఆ తరువాత అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు .