info.manatemples@mail.com

+91 9866933582

భులింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం -కొలనుపాక




నల్గొండ జిల్లా ఆలేరు నుంచి సిద్దిపేట వైపు వెళ్ళే మార్గం లో 6 కి మీ దూరం లో కొలనుపాక ఉంది . సుదీర్గ సాంస్కృతిక చారిత్రిక నేపధ్యం గల కొలనుపాక లో చాల దేవాలయాలు ఉన్నాయి . చాళుక్య ,కాకతీయ రాజుల పాలన లో ఆలయ నిర్మాణం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది .


జైన,శైవ ,వైష్ణవ సంప్రదాయాలకు నిలయంగా చరిత్ర పుటలోకెక్కిన కొలనుపాక లో వెలకట్టలేని చారిత్రక సంపద ఉంది .స్వయం భు గల వెలసిన సోమేశ్వర స్వామి ఆలయం లో శివలింగం పై వేయి లింగాలు చెక్కబడి ఉండటం ఒక ప్రథ్యెకథ.ఈ ఆలయమును కోటిలింగాల గుడి అనియు ,దక్షిణ కాశి గ పిలిచేవాళ్ళు గర్భ గుడి లో శ్రీ సోమేశ్వరుడు స్థావర లింగాకారం లో వెలసి ఉన్నాడు . ఈ లింగం నుంచే జగద్గురువు రేనుకచార్యులు వీర శైవ ధర్మాన్ని నలు దిశలా వ్యాప్తి చేసినట్లు పురాణం గాథ.


ప్రదాన ఆలయం చుట్టూ ఎన్నో ప్రాచిన శివలింగాలు, కాకతీయ ప్రతాప రుద్రుడు నిర్మించిన ఆతి ప్రాచిన శివాలయం ఉంది . కాకతీయుల శిల్ప చాతుర్యం , చాళుక్యుల కళా పోషణ ను తెలిపే శాశనాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి .


విశాలమైన ఆలయ ప్రాంగణం లో ముందు బాగాన శిల్పముజియమ్ ,వెనుక బాగాన ఆలయం ఉన్నది .
ఆలయ సమీపం లో ఉన్న ఇతర దేవాలయాలు :
శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం
జైన్ దేవాలయం


ప్రత్యేక కార్యక్రామాలు : -
ప్రతి ఏట చైత్ర బహుళ తదియ మొదలుకొని పంచమి వరకు బ్రమోత్సవాలు నిర్వహిస్తారు .



వెళ్ళే మార్గం : ఆలేరు నుంచి సిద్దిపేట వైపు వెళ్ళే మార్గం లో 6 కి మీ దూరం లో కొలనుపాక ఉంది