శ్రీకాకుళం జిల్లా లోని టెక్కలి మండల కేంద్రానికి 5 కి మీ దూరం లో గల రావి వలసలో వెలసిన పెద్ద శివలింగం మల్లికర్జునునిగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రాన్ని ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం గ కూడా పిలుస్తారు . కార్తిక కైలసంగా పేరు గాంచిన క్షేత్రం ఇది . శివలింగం ఎత్తు 20 అడుగులు. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం లో కార్తిక మాసం లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాబడుతాయి .
రావణ సంహారం అనంతరం లంక నుంచి అయోధ్య కు వెళ్తూ శ్రీ రాముడు సతి సమేతంగా రావి వలస లో శివుని పుజించినట్టు ప్రతీతి . ద్వాపర యుగం లో పాండవుల వన వాస సమయం లో ఇక్కడికి వచ్చి
సీతారాములు స్నానం చేసిన సీతకుండం గ పిలవబడే కొలను లో స్నానం చేసి స్వామి వారికీ అర్చన అభిషేకాలు చేసి కొంత కాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారు అని స్థలపురాణం చెబుతుంది .
స్వామి వారి దర్శనం వలన దీర్గకాళిక వ్యాధులు,అనారోగ్య భాదలు పోతాయని భక్తుల విశ్వాసము.