సృష్టి అంతమయ్యే సమయానికి యాగంటి బసవన్న రంకేలేస్తడు అని వీర బ్రహ్మం గారు తన కాలజ్ఞానం
లో వివరించారు . బనగానపల్లె కి 12 కి మీ దూరం దట్టమైన గుహల మద్య ఎంతో రమణీయంగా వెలసిన
క్షేత్రం యాగంటి ఉమా మహేశ్వర స్వామి దేవాలయం. ఎంతో అందంగా ఉండే ఈ దేవాలయం లో అందమైన
కోనేరు ..కొనెరులొ నంది పైనుండి జాలువారే నిటి ప్రవాహం కళ్ళను మహిమరిపించేల చేస్తాయి.
ఇద్దరు బక్తుల కోరిక పైన స్వామి వారు ఇక్కడ వెలసారని చెబుతారు .
ఆలయ నికి సమీపం లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక గుహలో ఉంది
అగస్త్యమహర్షి స్వామి వారు తపస్సు చేసిన గుహ ఒకటి ఉంది
వీరబ్ర్హమేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన గుహ ఇంకోటి ఉంది .
ఉమా మహేశ్వర ఆలయా మండపం ల ఉన్న నందీశ్వర స్వామి ఉంటారు . ఉమా మహేశ్వరుడు ఆర్ధనరిశ్వర
రూపం లో స్వయం భు లింగం గ ఇకక్డ వెంచేసి ఉన్నాడు .