యోగాలింగం -సిద్దక్షేత్రం - దుద్దేడ,మెదక్
మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామం లో వీరభద్ర స్వామి లింగ రూపం లో కొలువయి ఉన్నాడు అందుకీ ఈ క్షేత్రాన్ని యోగాలింగ క్షేత్రం అని అంటారు .
ఆలయ ప్రాంగణం లో మరొక లింగం ఉంది . దాని పానివట్టం నుండి నిరంతరం జలం ఊరుతూ ఉంటుంది .
ఈ ఆలయం లో కోనేరు ఉంది దాంట్లో పడమర,ఉత్తర ,దక్షిణ ల వైపు మూడు సొరంగ మార్గాలు ఉన్నాయి వాటి లో పడమర మార్గం స్వామి వారి గర్బగుడి వరకు ఉంది అని ,ఉత్తర వైపు ఉన్నది వేములవాడ వరకు ఉన్నది అని,దక్షిణ బాగం లో ఉన్నది కొమురవెల్లి వరకు ఉన్నది అని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది .
వెళ్ళు మార్గం :-
వెళ్ళు మార్గం : సిద్దేపేట్ నుంచి 11 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉన్నది .