గుంటూరు జిల్లాలోని తెనాలి మండల కేంద్రం లో గల సంగం జాగర్లమూడి లో వెలసిన పురాతనమైన దేవాలయం సంగమేశ్వర స్వామి దేవాలయం.సంగమేశ్వరాలయం చుట్టూ సువిశాలమైన ఆవరణ ఉంది.
ఆలయ ప్రాంగణం లోంచి దేవాలయంలోకి దారి తీస్తే, ముందుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు.తూర్పుముఖంగా ఉన్న ఆలయ గర్భగుడిలో సంగమేశ్వరుడు ఉండగా, కుడివైపున విఘ్నేశ్వరుడు, ఎడమవైపున కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తారు.
గుంటూరు జిల్లా జాగర్లమూడి సంగమేశ్వర దేవాలయం కొలువైన ప్రదేశంలో అత్రి మహర్షి సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేశాడట. తర్వాత ఆ పుణ్యభూమిలో సంగమేశ్వర స్వామికోసం ఆలయం కట్టించాడట.
అత్రి మహాముని కట్టించిన దేవాలయం శిథిలావస్థకు చేరగా, 17వ శతాబ్దం నాటి వెలమ రాజులు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.ఈ గ్రామం లో నే నిర్మించిన సాయిబాబా దేవాలయం ఎంతో అందంగా, రమణీయంగా ఉంటుంది .