బ్రహ్మరంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం
సుప్రీ సిద్ద శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం గుంటూరు పట్టణానికి 7 కి మీ దూరం లో గల పెద్ద కాకాని గ్రామం లో వెలసి ఉన్నది .
ఎంతో పురాతనమైన, చరిత్రాత్మకమైన ఈ శివాలయం, ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్టింపబడి, శ్రీకృష్ణదేవరాయలచే పునః ప్రతిష్టింపచేయబడింది మరియు రాష్ట్ర ప్రఖ్యాతి గాంచినది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా, ఎంతో దూరం నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది. నవరాత్రులు, శివరాత్రి ఒకటేమిటి, నిత్య కైలాసమే ఈ క్షేత్రం.
ఇంద్రకిలద్రికి మరియు గర్తపురికిని మద్యన గల యొక సుందరవనమునందు సిద్దయోగి ఆయన ఒక మహాబక్తుడు పరమేశ్వరుని కోసం యుగాల తరబడి తప్పస్సు చేసాడట ఆ ప్రదేశమే పెద్ద కాకాని పుణ్య క్షేత్రాముగా పిలవబడుతున్నది పరమ శివుడు ప్రత్యక్షమై భక్తుని కోరిక మేరకు శివలింగ రూపం లో ఈ క్షేత్రం లో వెలసి ఉన్నాడు అని పురాణాలూ చెబుతున్నాయి.ఆలయం లో శైవగమ పద్దతిలో పూజ కర్యాక్రమాలు నిర్వహించాబడుతాయి .
భరద్వాజ మహర్షి తన దక్షిణ యాత్ర సమయం లో ఈ క్షేత్రం లో ఉన్నాడు అని కొన్ని రోజులు యాగాలు నిర్వచించాడు అని స్థల పురాణం .
అష్టాదశ శక్తులలో ఒకరైన శ్రీ బ్రహ్మరాంబ దేవి ,ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి దర్శం వలన కలిగే ప్రయోజనం ఈ క్షేత్రాన్నిదర్శిస్తే సిద్దిస్తుంది అట .ఈ క్షేత్ర దర్శనం వలన సంతానం , మరియు పెళ్ళికాని వారికి తొందరగా వివాహాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం .
ఈ ఆలయం లో వివిధ మూర్తులు కొలువై ఉన్నారు .
నవగ్రహ దేవేలయం
రాహు-కేతు దేవాలయం
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం
శ్రీ సుబ్రమణ్య స్వామి దేవాలయం .
ఈ ఆలయం లో రాహు-కేతు దోష నివారణా పూజలు నిర్వహించాబడుతాయి . చాల పవిత్రమైన క్షేత్రం కూడా దోష నివారణకు .