మల్లికార్జున స్వామి దేవాలయం ,సలేశ్వరము
కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి ...
దట్టమైన నల్లమల్ల అడువులలో వెలసిన అత్యంత పురాతన శైవ క్షేత్రం సలేశ్వరము . హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం లో దట్టమైన అడవి మార్గం లో మన్ననూర్ నుండి సుమారు 30 కి మీ దూరం లో అడవి లోపల ఈ క్షేత్రం కొలువై ఉంది
దట్టమైన అరణ్యం లో ,చుట్టూ కొండలు ,మద్య మద్య లో ప్రవహించే సెలయేర్లు మద్యలో ఎంతో రమణీయంగా వెలసిన క్షేత్రం సాలేస్వర క్షేత్రం . పై నుంచి పారే నిటి సెలయేర్ల తో స్నానమాచరించి స్వామీ వారిని దర్సిన్చికుంటారు . ఈ నిటి తో స్నానం చేస్తే సకల రోగాల నయమవుతాయని భక్తుల విశ్వాసం .
ఈ క్షేత్రం లో స్వామి వారు లింగాకారం లో తెజోలింగాస్వరుపుడిగా కొలువై ఉన్నాడు . ప్రాచిన కాలం నుంచి ఇక్కడ నివసించే చెంచులే ఆలయ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు . అరణ్యం లో లబించే ఆకుల,అలములు,పండ్లు స్వామి వారికి నైవిద్యంగా సమ్పర్పిస్తారు.స్వామి వారి సన్నిది కి చెరువు లో వీరభద్ర స్వామి దేవాలయం,గంగమ్మ తల్లి కొలువై ఉన్నారు . ఆలయానికి చెరువు లో పుట్ట ఉంది
ప్రత్యేక పూజలు : -
చైత్ర శుద్ధ త్రయోదశి నుండి బహుళ తదియా వరకు స్వామి వారి వార్షికోత్సవాలు నిర్వహిస్తారు . చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వెన్నెల కాంతి స్వామి వారి పైన పడుతుందట అందుకే ఆ రోజు స్వామి వారిని చూడటానికి చాల మంది భక్తులు వస్తారు .
సాదారణ రోజుల్లో ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కార్తిక పౌర్ణమి కి 5 రోజులు ఇక్కడ వెళ్ళడానికి
సదుపాయాలు కల్పిస్తారు . జీవిత కాలం లో తప్పకుండ ఒకసారి అయిన దర్సించాల్సిన క్షేత్రం ఇది
సమీపం లో క్షేత్రం :-
మన్ననూర్ నుండి 50 మీ దూరం లో మల్లెలతీర్తం కొలువై ఉంది . 400 అడుగులు లోతులో ఎంతో రమణీయంగా ఉంటుంది
Temple address: 30kms from mannanur checkpost in Nallamala forest,Hyderabad-Srisailam Road.