దేవతలకు ,రాక్షసులకు జరిగిన యుద్ధం లో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి వదించి అతని కంఠం లోని అమృత లింగాన్ని అయుదు ఖండాలుగా కండిస్తాడు. ఆ అయుదు అయుదూ ప్రదేశాల్లో పడుతాయి అవె పంచారామాలు .
(1) అమరారామము (అమరావతి )
(2) సోమారామము (బీమవరం)
(3) క్షీరారామము (పాలకొల్లు )
(4) ద్రాక్షారామము (ద్రాక్షారామము )
(5) కుమారారామము (సామర్లకోట )
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామం పాలకొల్లు పట్టణం లో వెలసింది . తెల్లగా పాలవలె మెరిసే రెండున్నర అడుగుల ఎత్తున్న శివలింగం ఇక్కడ భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది .
ఇక్కడ వెలసిన అమ్రుతలింగాన్ని , బ్ర్హమహాది దేవతలు వెంట రాగ శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రతిష్టించి శివుని కోరిక పై క్షేత్ర పాలకుడిగా లక్ష్మి సమేతుడై జనార్ధన స్వామి గ కొలువైనాడు .
శ్రీ మహావిష్ణువు ప్రతిష్టించిన అమృత లింగాన్ని శ్రీ రాముడు భక్తీ శ్రద్దలతో పుజించుతచే శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అనే నామదేయం స్వామికి స్తీరపడింది . ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే.
ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి.
శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామికి అభిముఖంగా గల ప్రకార మండపం లో కుడి ప్రక్కన త్రిపుర సుందరి దేవి కొలువుదీరింది . ఆలయ ప్రాంగణం లో విజ్ఞేశ్వర , గోకర్నేశ్వర , సుబ్రమణ్య స్వామి ఆలయాలు ప్రాదనమైనవి .
Route Map:-