కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం,సామర్లకోటు
పంచరామ క్షేత్రాల్లో ఒకటైన “కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం” తూర్పు గోదావరి జిల్లా లోని సామర్లకోటలో ఉంది. సామర్లకోటలో వెలసిన భీమేశ్వరాలయాన్ని కుమారారామం అంటారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 50 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించాడని, అందుకే కుమారారామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు.
క్రీ.శ 892 నుంచి 921 వరకు మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి, ఆలయానికి ప్రాకార, మండపాలను నిర్మించాడు. సామర్లకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణశైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. రెండు అంతస్తుల సువిశాల ఆలయ ప్రాంగణం మద్య గర్భ గుడి లో భీమేశ్వర స్వామి కొలువై ఉన్నడు
శ్రీ విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో ,కోనేటి జలాలతో , చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించాగానే మనసుకి ఎంతో ఆహ్లాదం , ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాల భైరవుడు , వీరభద్రుడు,మహాకాళి,శనేశ్వరుడు , నవగ్రహాలు కొలువుదీరు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి.గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది.
ఇక్కడి అమ్మవారు బాల త్రిపురసుందరి, ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడకు చేరాలంటే రాజమండ్రి నుంచి బస్సు, రైలు మార్గాలున్నాయి.
ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు .అభిషేకాలు , ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి.
వెళ్ళు మార్గం
---------------------
కాకినాడ నుండి 15 కి మీ ,రాజముండ్రి నుండి 49 కి మీ ,అన్నవరం నుండి 40 కి మీ దూరం
లో ఈ క్షేత్రం ఉంది .
How to Reach:-
Samarlakota is 40 km from Annavaram, 15 km from Kakinada, 49 km from Rajahmundry, and 125 km from Visakhapatnam. As Samalkot is on the Vijaywada-Howrah broad gauge railway line of South – Central Railway, a lot of trains stop here.
Route Map:-