350 సంవత్సరల చరిత్ర గల మరో పుణ్య క్షేత్రం శివ గంగ రాజ రాజేశ్వరి దేవాలయం. భాగ్యనగరం నుంచి సుమారు 50 కి మీ దూరం లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గం లో వెలసిన ప్రసిద్ద శైవ క్షేత్రం .
ఆక్కన్న -మాదన్న లు ఈ దేవాలయాన్ని అభిరుద్ది చేసారు అని పురాణాలూ చెబుతున్నాయి .
శివ గంగ పుష్కరాని మద్యలో ఈ అందమైన దేవాలయం నిర్మించబడింది . రెండు అంతస్తుల ఈ దేవాలయం ఎంతో చూడ చక్కగా ఉంటుంది . పుష్కరానిలో స్నానం అచారించి రాజ రాజేశ్వరి అమ్మ వారిని దర్శనం చేసుకుంటారు .
ఆలయ ఆవరణ లో గణపతి విగ్రహం కూడా ఉంటుంది .మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ చాల వైభవంగా జరుగుతాయి .ప్రతి ఒక్కరు దర్సించాల్సిన క్షేత్రం .