info.manatemples@mail.com

+91 9866933582

లింగమంతుల స్వామి (పెద్దగట్టు) దేవాలయం-దురాజ్ పల్లి


పెద్దగట్టు (గొల్లగట్టు) జాతర

పెద్దగట్టు (గొల్లగట్టు) భక్త జన సంద్రమైంది. సూర్యాపేట జిల్లాలోని కేసారం గ్రామంలో లింగమంతుల స్వామి కొలువైన ఈ గట్టుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ‘ఓ లింగా’నామస్మరణతో మార్మోగాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టె ఆలయానికి చేరుకోవడంతో జాతర ప్రారంభమైంది. రెండో రోజు సోమవారం బోనాల సమర్పణకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంతంకిక్కిరిసింది.

తెల్లవారు జామునుంచి బోనాల సమర్పణ.. తెల్లవారుజాము నుంచి మొదలైన బోనాల సమర్పణ, గంపల ప్రదక్షిణ రాత్రి పొద్దుపోయే వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. ఎండ బాగా ఉన్నా, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేయడంతో జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనం చేసుకున్నారు. కరోనా భయం ఉన్నా భక్తులు భారీ ఎత్తున తరలిరావడం గమనార్హం. స్వామి దర్శనం తర్వాత భక్తులు యాటపోతులను బలిఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు బోనమెత్తుకొని చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక మూడో రోజు మంగళవారం ప్రధాన ఆలయం ముందు పూజారులు చంద్రపట్నం వేయనున్నారు.





సూర్యాపేట సమీపంలో దురాజ్ పల్లిలో లింగమంతుల స్వామి (పెద్దగట్టు) దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైన దేవాలయం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి ఒక్కడ జాతర జరుగుతుంది .శివుడే ఇక్కడ లింగామంతుల స్వామి గా వేలుగొండుతున్నాడు.


400 సంవత్సరల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో ఘనమైన చరిత్ర కలదు . ఇక్కడ జరిగే జాతర కూడా ఎంతో విశేషమైనది .ఇక్కడ స్వామి వారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం .


తెలంగాణాలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతరలలో ఒక్కటి లింగమంతుల స్వామి జాతర.భక్తులు లింగమంతుల స్వామిని ఆరాధ్య దైవంగా కొలుస్తూ తాము కోరిన కోర్కెలను నెరవేర్చాలని గొర్రెను బలిస్తారు.


రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. జాతరకు ముందు కేసారం గ్రామం నుంచి దేవతా విగ్రహాలకు దిష్టిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సమ్మక్క-సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతరగా జరుపుకునే ఈ లింగమంతుల స్వామి జాతర.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో ఇక్కడ జాతర మొదలవుతుంది .