సిద్దిపేట్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామమందు వెలసిన పురాతన శైవ క్షేత్రమే మల్లికార్జున స్వామి దేవాలయం . దిన్నె కొమురేల్లి మల్లన్న దేవాలయం అని కూడా అంటారు . ఇంద్రకీలాద్రి అనే పర్వతం పైన 11 వ శతాబ్దం లో వెలసినట్లు ప్రతిక .
ఇక్కడ స్వామి వారు కోరిన కోరికలను తీర్చే దైవం అని ప్రజల విశ్వాసము.5 వందల సంవత్సరాల క్రితం పుట్ట మట్టిచే చేసిన స్వామి వారి విగ్రహం ఇప్పటివరకు చెక్కు చెదరకుండా భక్తుల పాలిట కల్పతరువై వెలసి ఉన్నాడు .
ఆలయ నిర్మాణం లో కాకతీయుల ,చాళుక్యుల శిల్ప సంపద కనిపిస్తుంది .కొమురవెల్లి మల్లన్న స్వామీని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. గుడి ఎదురుగా గంగ రేగి వృక్షము కలదు.
కొమురేల్లి మల్లన్న జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు.