info.manatemples@mail.com

+91 9866933582

కామాక్షి దేవాలయం కాంచీ




కామాక్షి స్వరూపమునకు లలితా స్వరూపమునకు అభేదము. దక్షిణ భారతదేశము మొత్తము మీద ఉన్న ఒకే ఒక మోక్షపురి, ఎంతో గొప్పదైన కాంచీ పట్టణములో విజయం చేసి ఉన్న కామాక్షి అమ్మవారు అపారమైన శక్తిస్వరూపురాలు. ఆ క్షేత్రములో నిరంతరము అమ్మవారి శక్తి వైభవమును కాపాడే క్షేత్రపాలకుడు అయ్యప్పస్వామి. వారాహి దేవాలయము, రాజశ్యామలా దేవాలయము ఏకకాలములో చూడటానికి వీలైనది ఒక్క కాంచిక్షేత్రము. ఆ క్షేత్రమునకు అంత వైభవము ఎందుకు వచ్చింది? దేశపటము అంతటినీ ఒక అమ్మవారుగా భావిస్తే అమ్మవారి నాభిస్థానము ఉన్న ప్రదేశము కంచి క్షేత్రము. అక్కడ పూజావిధానమును ఏర్పాటు చేసినది దుర్వాసో మహర్షి. అమ్మవారి దేవాలయములో ఉన్న 24 స్తంభముల మండపమును గాయత్రి మంటపమని పిలుస్తారు. .

ఎవరు ఏ కోరిక కోరుకున్నా తీర్చకపోవడము ఉండదు. ఆవిడ పేరే కామాక్షి. అక్షి అంటే కన్ను. ‘క’ అంటే బ్రహ్మశక్తి, ‘మ’ అంటే విష్ణు శక్తి. ఆవిడ పాదముల పడిన వారికి సరస్వతి కటాక్షము, ఐశ్వర్యం ఏది కావాలి అంటే అది కలుగుతుంది. కామాక్షి అమ్మవారికి ఇంకొక పేరు కామకోటి. కోటి అనగా హద్దు. కామము అనగా కోరిక. ఆవిడ సరస్వతీశక్తి, లక్ష్మీశక్తి, పార్వతీశక్తి మూడు శక్తులు ఉన్న మూలపుటమ్మ. ఏదైనా ఇవ్వగల ఆమె కామదాయిని.






వెళ్ళు మార్గం