info.manatemples@mail.com

+91 9866933582

చాముండేశ్వరి దేవాలయం మైసూర్




చాముండేశ్వరి దేవాలయం మైసూర్ పట్టణానికి 13 కి.మీ దూరం లో కొండ పైన కొలువైన అమ్మవారి క్షేత్రం.ఇ క్షేత్రాన్ని త్రిమూట క్షేత్రంగా పిలిచేవారు.క్షేత్ర మహాత్యం గురుంచి స్కందపురణంలో వివరించడం జరిగింది.ఇ కొండ చుట్టూ 8 కొండలు ఉన్నాయి.పూర్వం ఇ ప్రదేశాన్ని మహాబలాద్రి అని కూడా పిలిచేవారు. గర్భాలయం లో అమ్మవారు సింహం పైన కూర్చొని చేతిలో త్రిశూలం తో ఎంతో దేదీప్యమానంగా దర్శనం ఇస్తుంది. .


అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఇది ఒకటి.దేవాలయ నిర్మాణం అంత ద్రావిడ శైలి లో కట్టబడింది.7 అంతస్తుల గోపురం,ఆలయ ద్వారాలు చాలా అద్భుతంగా నిర్మించబడ్డాయి. బ్రహ్మచే వరం పొంది సకల దేవతలను,మనుషులను హింసిస్తున్న మహాససురుని పార్వతి అమ్మ వారు చాముండేశ్వరి రూపం దాల్చి 10 రోజులు యుద్ధం చేసి అంతమొందించింది.


ప్రతి సంవత్సరం దసరా కి 10 రోజులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు



వెళ్ళు మార్గం