info.manatemples@mail.com

+91 9866933582

పురూహుతికా దేవి ఆలయం,పిఠాపురం




తూర్పు గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధమైనది.దాక్షాయణీ దేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ. దాక్షాయణీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడటం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురంగా పేరొచ్చింది. దిన క్రమంగా పిఠాపురంగా మారింది. అష్టాదశ శక్తి పీఠాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి అమ్మవారి పేరు పురూహుతిక దేవి. పురూహుతికా దేవి ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వరస్వామి ఆలయం ఉంది. కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలోని శివలింగం స్వయంభూ శివలింగం.

దత్తాత్రేయ లేదా దత్తా ను హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది.దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం.



పిఠాపురం దేశంలోని త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృప కోసం తపస్సు చేశాడు. తన దేహం పవిత్రమైనదిగా చేయాలని అతడు వరం కోరాడు. అతడి కోరిక ప్రకారం అతడి దేహంపై ఇక్కడ యజ్ఞాన్ని ఆరు రోజులు నిర్వహించారు. విష్ణువు వరం ప్రకారం అతడి పాదభాగం పిఠాపురంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చింది.



అలాగే, పిఠాపురం వైష్ణవ క్షేత్రం కూడా. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోసం ఐదు ప్రాంతాల్లో విష్ణాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం.ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం,ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం,పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి.


ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మార్గశిర శుక్ల పౌర్ణమికి దత్త పీటం లో దత్తాత్రేయ జయంతి ఘనంగా నిర్వహిస్తారు .
వెళ్ళు మార్గం
---------------------
పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్ళు అన్నీ పిఠాపురంలో ఆగుతాయి. ఇవి కాక, జిల్లా కేంద్ర మైన కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.









Route Map :-