info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం - శ్రీశైలం




ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండవదైన శ్రీశైలం కర్నూల్ జిల్లా కేంద్రం లో వెలసింది . దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది .


తెలుగు ప్రజల అదృష్టం ఏంటి అంటే శ్రీశైలం వెళ్లినవారికి ,జ్యోతిర్లింగం మరియు శక్తి పీటం దర్శనం అవుతుంది . ఈ దేవాలయం చుట్టూ ప్రక్కల చూడవలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి .




స్థల పురాణం
-------------------
పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు . ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు . తరువాత పర్వతుడు వరం కోరుతూ నేను దాల్చి ,నీవు న పై వెలసి,నా పర్వత శికరాన్ని చుసిన మేరకు ఈశ్వరుడు జ్యోతిర్లింగా రూపం లో వెలిసాడు . పర్వతుడు శ్రీ పర్వతుడుగా అయ్యాడు ,కాల క్రమం లో శ్రీశైలం గ పిలువబడుతున్నది .


శ్రిశైలన్ని ఈ భూమికి మొతానికి నాభి గ చెబుతారు . అందుకీ మనం ప్రపంచం లో ఎక్కడ ఉన్న సంకల్పం చేసేటప్పుడు శ్రిసైలష్య ఏ దిక్కున ఉంటె ఆ దిక్కు గురుంచి చేబుతుంటము . ఈ దేవాలయం చాల పెద్దది . కృతయుగం లో హిరణ్య శివుడి పూజ మందిరంగా ఉంది . త్రేతా యుగం లో రాముడు ,సీత ఇక్కడ ప్రతిష్టించిన సహస్రలింగం ఇప్పటికి పుజలన్డుకుంటుంది .


తిరుపతి లో ఉన్నది ఆకాశ గంగ, శ్శ్రీశైలం లో ఉన్నది పాతాల గంగ . మన శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి దేవాలయం ఇక్కడ ఉన్నది . శ్రీశైలం చుట్టప్రక్కల చూడవలసిన దేవాలయాలు
సాక్షి గణపతి దేవాలయం
హటకేశ్వర స్వామి దేవాలయం
పాలధార పంచదార
శికర దర్శనం
ఖైలస ద్వారం
అక్కమాదేవి గుహలు
భీముని కొలను
గుప్తా మల్లికార్జున దేవాలయం
బ్రహ్మరంబ చెరువు






Route Map :-