రాఘవేంద్ర స్వామి దేవాలయం - బిచాలే
బిచాలే లేక భిక్షాలయా రాయచూరు జిల్లా లో తుంగభద్ర నది తీరాన కొలువైన దివ్యమైన ప్రదేశము..
రాయరు(రాఘవేంద్ర స్వామి) వారు ఇ క్షేత్రం లో అప్పనాచార్య తో కలిసి 13 సంవత్సరాలు ఇక్కడ ఉండి జపం చేసుకునే వారట.. రాయరు వారు ఉన్న ఇల్లు, జపలు చేసుకున్న ప్రాంతం ఇప్పటికి కొలువై ఉంది.
ఇ క్షేత్రం లొనే శ్రీపాద రాజరు ప్రతిష్టించి నరసింహ విగ్రహం,వ్యాస రాయరు వారు ప్రతిష్టించిన హనుమాన్ విగ్రహం కొలువై ఉన్నాయి.అప్పనాచర్య వారి చే ప్రతిష్టించిన రాయరు బృందావనం కూడా కలదు.
స్వామి వారు ఇక్కడి నుండి తుంగ భద్ర నదిలో ప్రయాణించి మంత్రాలయము చేరుకునే వారు.
మంత్రాలయం వెళ్లిన వారు తప్పకుండా బిచాలే దర్శించుకోవాలి
.