వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం - కందిమల్లయ్య పల్లె
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం కడప జిల్లా మైదకూరు -ప్రొద్దుటూరు ప్రధాన రహదారి పైన ఉన్నది .ఈ క్షేత్రాన్నే బ్రహ్మం గారి మటం అని కూడా పిలుస్తారు . వీరబ్రహ్మేంద్ర స్వామి 12 వ ఏటనే దేశ సంచారానికి బయలుదేరి కర్నూల్ జిల్లా బనగానేపల్లికి చేరుకున్నారు . అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మగారింట్లో పశువుల కాపరిగా చేరారు . తానూ గిసిన గిరి లో పశువులు మేస్తుండగా శ్రీ వీరభద్ర స్వామి శిల్పాన్ని మలిచారు గుహలో కూర్చొని కాలజ్ఞాన రచన చేసారు .
జగద్గురువు శ్రీ.శ్రీ.శ్రీ.మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు, జీవసమాధి గావించిన మహాక్షేత్రం బ్రహ్మం గారి మఠం. కనులకు ఇంపుగా, పచ్చని కొండల నడుమ వెలసిన పుణ్య క్షేత్రం. వీరబ్రహ్మేంద్ర స్వాముల సమాధి నిష్టతో " ఓం నమో భగవతే వీరభద్రయ” అనే మూల మంత్రాన్ని జపించింగ శ్రీ వీరభద్ర స్వామి తనే స్వయంగా ఉత్తరాభిముకుడై ప్రతిష్టులయ్యారు. దేవాలయ ప్రాంగణం లో వీరభద్ర స్వామి దేవాలయం, శ్రీ అర్ధనారీశ్వరుడు లింగమూర్తి అయి పార్వతి దేవి తో ఉత్తరాభిముకుడై వెలసి ఉన్నాడు అర్ధనారీశ్వరుడు నికి ముందు వైపు కేదారేశ్వరుడు లింగ రూపం పుర్వభిముకుడై ఉన్నాడు .