వీర భద్ర స్వామి దేవాలయం - కురువై గ్రామం
వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండల కేంద్రానికి 11 కి మీ దూరం లో ఉన్న కురువై గ్రామం లో వెలసిన ప్రసిద్ద వీరభద్ర స్వామి ఆలయం చాళుక్యుల కాలం నాటిదని స్థల పురాణం .
24 స్థంబాల మహామండపం తో మూడు గర్భాలయలతో విస్తరింపబడి ఉన్నది. చాళుక్యులు శిల్పకళ ఈ దేవాలయం లో కనిపిస్తుంటుంది . వీరభద్ర స్వామి మూలవిరాట్టు పశ్చిమ దిశగా శ్రీ భాద్రేస్వరి సమేతంగా కొలువై ఉన్న క్షేత్రం.
శ్రీ స్వామి వారి కుడివైపున విజ్ఞేశ్వర స్వామి నాలుగు హస్తములతో చేయబడి ఉన్నది. శ్రీ స్వామి వారి ఎడమ బాగమునందు రెండు ఘనప్రతిమలు,గర్భాలయ ముఖద్వారమున రెండు పూర్ణ కుంభాలు చెక్కబడి ఉన్నవి .ఇక్కడ స్వామి వారి ప్రతి నిత్యం పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాబడుతాయి .
ప్రత్యేక కార్యక్రామాలు :-
మహా శివరాత్రి
బోనాలు
బతుకమ్మ పండుగలకు ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయ్.
వెళ్ళు మార్గం : - మంగపేట్ కి సుమారు 5 కి మీ దూరం లో ఉన్న ఈ క్షేత్రం ఎటూరునాగారం
-భద్రాచలం వెళ్ళు మార్గం లో వస్తుంది .
>