వేణుగోపాల స్వామి దేవాలయం -నెమలి
కృష్ణ జిల్లాల్లోని నెమలి గ్రామం లో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చాల ప్రసిద్దిగాంచిన దేవాలయం . 1953 లో భూగర్భం నుండి అవతరించాడు అని చెబుతారు .
భు అంతర్బాగం లో స్వామి వారి విగ్రహం దొరుకగ అక్కడే స్వామి వారు కొలువై భక్తుల అబిస్టాలను నెరవేర్చేఇలవేల్పుగా ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు.
నెమలికి ఉత్తరంగా కి మీ దూరం లో నెమలి ఏరు అని నది ప్రవహిస్తుంది . ఆ ఏరు కల్లూరు గుట్టలనుంచి పశ్చిమ దిశగా ప్రవహించి నేమలిగుండా సాగి కీసర దగ్గర మునేరు లో కలిసిపోతుంది .
స్వామి వారి ఆలయం లో నిర్మించిన అద్దాల మందిరం ఎంతో ఆకర్షణగాఉంటుంది.
ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే పూజలతో పాటు సోమ ,శుక్ర వారాల్లో విశెసమైన పూజలు నిర్వహించాబడుతాయి . కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించాబడుతాయి .
ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే స్వామి వారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా ,కనుల పండుగగా జరుగుతాయి .
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నెమలి, జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో, ఆరురోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి కృష్ణా, ఖమ్మం జిల్లాల నుడియేగాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి, లక్షలాది మంది భక్తులు తరలివచ్చెదరు.