info.manatemples@mail.com

+91 9866933582

జగన్నాథ స్వామి దేవాలయం -వడాలి




దక్షిణ పూరి గ పిలువబడే వడాలి గ్రామం కృష్ణ జిల్లా ముదినేపల్లి మండల కేంద్రం లో ఉంది . 200 సంవత్సరాల క్రితం నిర్మించిన జగన్నాథస్వామి దేవాలయం దక్షిణ పురిగా ప్రసిద్ది చెందింది .


గుడివాడ - బంటు మిల్లి ప్రధాన రహదారికి సమీపం లో కొలువైన బలరామ,సుబధ్ర సమేత జగన్నాథ స్వామి దేవాలయం ఒకప్పుడు దేదిప్యామానంగా వెలుగొందిన క్షేత్రం .అంతులేని భు సంపద ఉండేది అంత ఆక్రమణకు గురి అయిపొయింది . కాని నేడు తిరిగి అత్యంత వైభవంగా పునర్నిర్మాణం గావిన్చాబడుతుంది .


1765 వ సంవత్సరం లో ఒక వైష్ణవ భక్తుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది . భక్తుడు స్వప్నం లో స్వామి వారు దర్శనమిచ్చి తనకు దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించగా స్వామి వారి అజ్ఞానుసారం ఆ భక్తుడు దేవయానికి కావాల్సిన భూమిని ఆ ప్రాంతాన్ని పరిపాలించే నావాబ్ దగ్గర నుండి పొంది ,పూరి నుండి విగ్రహాలను తీసుకోని వచ్చి ఇక్కడ దేవాలయాన్ని ఎంతో అద్బుతంగా ,రమణీయంగా నిర్మించారు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు దట్టమైన అరణ్యం ల ఉండేది బోయల ఎక్కువ ఉండే ఈ ప్రదేశాన్ని పూర్వము వ్యాధాళి అనేవారట అది కాలక్రమేనా వడాలి గ రూపాంతరం చెందింది అని చేబుతురు .


ప్రత్యేక పూజలు /కార్యక్రామాలు :
ప్రతి నిత్యం స్వామీ వారికి జరిగే కార్యక్రమాల తో పాటు శ్రీ కృష్ణాష్టమి కి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు .
ఎంతో మహిమన్మితమైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండ దర్శించి తీరాల్సిందే!
వెళ్ళు మార్గం

గుడివాడ - బంటు మిల్లి ప్రధాన రహదారికి సమీపం లో ఈ పుణ్యక్షేత్రం ఉంది.



Route Map : -