info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం




గుజరాత్లోని శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం : గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ గ్రామం వద్ద సోమనాథ్ క్షేత్రం ఉన్నది. శివ భక్తులు విరివిగా దర్శించే ఈ సోమనాథ్ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సోమనాధ జ్యోతిర్లింగక్షేత్రం తొలి తీర్దయాత్ర కేంద్రంగా ప్రసిద్దిచెందింది. శివపురాణం కథనం ప్రకారం చంద్రుడు ప్రజాపతి యొక్క 27 కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. కానీ వారిలో రోహిణి పట్ల మాత్రమే అచంచల ప్రేమను ప్రదర్శిస్తుంటాడు. మిగిలిన పుత్రికలను పట్టించుకోవడంలేదని కలత చెందిన దక్షప్రజాపతి చంద్రుని యొక్క ప్రభ / అందం నశించగలదు శపిస్తాడు. కలత చెందిన చంద్రుడు రోహిణితో సహా సోమనాథ్ చేరుకుని అచట స్పర్శ లింగాన్ని ఎంతో నిష్టతో పూజ చేస్తాడు. తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందిన చంద్రుడు తిరిగి కోల్పోయిన ప్రభని పొందాడు. అంతట శివుడు చంద్రుని కోరికతో సోమనాధుడుగా అచట నుండి భక్తులు కోరిన కోర్కెలను నెరవేస్తున్నారు. అయితే కాలక్రమంలో ఈ జ్యోతిర్లింగం 16సార్లు ధ్వంసం కావించబడినప్పటికీ తిరిగి జీర్ణోద్ధారణ పొందింది.










ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మహా శివరాత్రి ఉత్సవాలు ,స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు,
వెళ్ళు మార్గం
---------------------


Route Map:-