info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్




ఉజ్జయినీలోని దట్టమైన మహాకాల్ అడవిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. మధ్యప్రదేశ్ లోని ఈ జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పుణ్య క్షేత్రం. ఈ జ్యోతిర్లింగం ఎలా ఉనికిలోకి వచ్చింది అనేదానికి సంబంధించిన అనేక కథలు పురాణముల్లో చెప్పబడి ఉన్నాయి. ఓ కథనం ప్రకారం, ఉజ్జయినీ రాజు చంద్రశేనా శివుడి భక్తుడు. మరో వైపు ఐదు సంవత్సరాల బాలుడు శ్రీకర్ తన రాజైన చంద్రసేనా శివభక్తి ప్రేరేపితుడయి, శ్రీకర్ ఒక రాయి తీసుకొని శివుడిగా పూజించటం మొదలుపెట్టాడు. అనేకమంది ప్రజలు ఆయనను విభిన్న మార్గాల్లో విరమించుకోడానికై తగు రీతిలో భంగపరిచే విధంగా ప్రయత్నించారు.

కానీ ఆ బాలుడి భక్తి పెరుగుతూ వచ్చింది. తన భక్తితో ప్రసన్నుడైన శివుడు, జ్యోతిర్లింగం రూపాన్ని ధరించి మహాకాల్ అడవిలో నివసించాడు. మహాకాలేశ్వర దేవాలయం హిందువులకు అతి ముఖ్యమైన దివ్యక్షేత్రముగా పరిగణించడంలో మరో కారణము, ఇది ఏడు "ముక్తి-స్థల్" దేవాలయాల్లో ఒకటి. "ముక్తి-స్థల్" అంటే అర్ధం “మానవ జన్మ నుండి విముక్తి చేసే ప్రదేశం”. ఇక్కడ చితా భస్మ పూజ చాలా బాగుంటుంది. ఆ పూజను ప్రత్యక్షంగా కళ్ళతో చూడాలి గాని మాటలతో వర్ణించలేము. .






Route Map :-