info.manatemples@mail.com

+91 9866933582

వన దుర్గాభవాని దేవాలయం –ఏడుపాయల, మెదక్




భాగ్యనగరానికి 110కి మీ దూరం లో మెదక్ పట్టణం నుంచి 20 కి మీ దూరం లో అటవీ ప్రాంతం లో వెలసిన అమ్మవారి క్షేత్రం దుర్గాభవాని అలయమ్. దేవాలయం చుట్టూ అటవీ ప్రాంతం ఉన్నది. పచ్చని చెట్లు,రాళ్ళూ గుట్టల మద్య గల గల పారే మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి మధ్యలో గుహ లో స్వయం భు మాతా గ వెలసి యున్నది.

కోరిన కోరికలు తీర్చే తల్లి అని ,ఇక్కడికి చాలమంది భక్తులు వస్తు ఉంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడే జరిగే జాతర లో లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రము నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తు ఉంటారు .


ఇక్కడికి వచ్చే భక్తులు మంజీరా నది లో స్నానం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు .ఇక్కడ జరిగే రథోత్సవం చాల కనుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ జరిగే జాతర లో అన్ని రకాల కుల వృత్తుల వాళ్ళు పాల్గొంటారు . ఈ గుహాలయం నది తీరాన దిగువ బాగం లో ఉండగా ,దిని పై బాగమున పుట్టయు, పుట్టకు సమీపమున చిన్న గుహ ఉంది . పూర్వ కాలం లో మునులు అక్కడ తపస్సు చేసేవారట. అందుచేత ఆ గుహకు మునుల గుహ అని పేరు ,పుట్టకు మునుల పుట్ట అని పేరు వచ్చింది అని చెబుతారు .


ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా దుర్గభవాని ని దర్శించుకొని కొండ పైకి వెళ్లి ముని గుహను సందర్శిస్తారు. వెళ్ళు మార్గం :- మెదక్ పట్టణం నుంచి 20 కి మీ దూరం లో ఉంటుంది