దత్తాత్రేయ స్వామి దేవాలయం ( దత్త పిటం)- వల్లభాపురం,మక్తల్
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రం లో గల వల్లభాపురం గ్రామం లో వెలసిన మహిమన్మితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయం . దత్తత్రేయ్ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెలసిన క్షేత్రం . శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మ స్థలం పీటాపురం అయితే తన తపస్స్సు,ధ్యానం అన్ని కుర్వాపూర్ లోనే జరిగాయి . వల్లభాపురం తెలంగాణా మరియు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది . కృష్ణ నదికి ఇవతలి వైపు వల్లభాపురం,అవతలి వైపు కురువాపూర్ ఉంటుంది .
కృష్ణ నది సమీపం లో వెలసిన మహిమన్మితమిన దత్త పీటం ఇది . శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ ఈ క్షేత్రం లో కూడా వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండిభక్తులు కష్టాలు తీర్చాడట .
ఈ క్షేత్రం చాల మహిమన్మిథమైనది . కష్టాలు వచ్చినప్పుడు కానీ ,దుష్ట శక్తుల బారి నుంచి
కాపాడుకోడానికి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని స్థల పురాణం !!
శ్రవణ పౌర్ణిమ ,దత్త జయంతికి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .
హైదరాబాద్ నుండి మక్తల్ కి చాల బస్సు సర్వీస్ లు ఉంటాయి.(Hyderabad-Makthal)