పట్టిసీమ వీరాభద్ర స్వామి దేవాలయం
వీరాభద్రుడు రుద్రాంశ సంభూతుడు . సతీ వియోగాన్ని బరించలేక సృష్టించిన విద్వంశాకారుడు
,అగ్రహోధగ్రుడు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ దేశంలోని ప్రముఖ వీరభద్ర క్షేత్రం . రాజముండ్రి
నుంచి సుమారు 45 కి మీ దూరం లో పోలవరినికి దగ్గరగ గోదావరి మద్యలో వెలసిన అద్బుత దేవాలయం
ఇది .స్థల పురాణం ప్రకారం పిలవని పేరంటానికి వెళ్ళిన సతీదేవి తన తండ్రి చేసిన శివ దుశానను
బరించలేక యోగాగ్ని లో దగ్దం అవుతుంది. అప్పుడు శివుడు ఆగ్రహం తో తాండవం చేస్తూ తన శిరస్సు
నుంచి ఒక జట ను తీసి నేలకేసి కొట్టగా దాన్ననుంచి బీకారకారం తో అవిర్బవించాడు వీరాభద్రుడు.
ప్రమథ గణాలతో దక్ష యాగం జరుగుతున్నా చోటికి వెళ్లి పట్టాసం అనే ఆయుధం తో దక్షుడి శిరస్సు
కండించాడు. అనంతరం పట్టసాన్ని నేటి పట్టిసీమ ప్రాంతం లో గోదావరి నది లో కడిగి ఆ కొండ
పైన భద్రకాళి తో సహా లింగ రూపం లో కొలువయ్యడని నాటి నుంచి వీరేశ్వరుడిగా భక్తుల పూజలు
అందుకుంటున్నాడు అని ప్రతీతి .
వీరాభద్రుడు ఉగ్రమూర్తిగా ఉన్నప్పుడు అగస్త్యుడు అతన్ని ఆలింగనం చేసుకొని అనునయించి
,శాంతింప చేసిన స్థలం ఇది అని అంటారు. స్వామి వారు లింగాక్రుతుడై నిలించిన వీరభాద్రేస్వరుడు
. అమ్మవారు భద్రకాళి .
ఆలయం లో గల అరిశ్వరి ,పురిశ్వరి దేవతలకు పూజిస్తే సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం
. గోదావరి నది ఎంత ఉద్రుతిగా ఉన్న నది గర్భం లో ఉన్న ఈ ఆలయం చెక్కు చెదరలేదు.
ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రామాలు
--------------------------------------------
మహా శివరాత్రి ఉత్సవాలు ,స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు
అందమైన గోదావరి నది లో వెలసిన ఈ పవిత్ర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి తరించాల్సిందే
.
వెళ్ళు మార్గం
---------------------
రాజముండ్రి నుండి 45 కి మీ దూరం లో పోలవరినికి దగ్గరగ ఈ క్షేత్రం ఉంది .
Route Map : -