info.manatemples@mail.com

+91 9866933582

ఆంజనేయ స్వామి దేవాలయం –బీచ్పల్లీ





హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్ళే మార్గం లో కృష్ణ నది తీరాన బీచ్పల్లీ గ్రామం లో వెలసిన క్షేత్రం బీచ్పల్లీఆంజనేయ స్వామి దేవాలయం .


వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని గద్వాల్ రాజుల కాలం లో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తుంది . ఈ ఆలయం లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శ్రీ వ్యాసరాయల వారు స్థాపించారట . స్వామి వారు స్వప్నం లో కనిపించి తన దర్శాన్ని మొదట ఎవరైతే చేస్తారో వల్లే ఈ దేవాలయనికి పూజ కార్యక్రామాలు చేస్తారు అని సేలువిచ్చాడట .ఆ తదుపరి రోజు లేచి చూడగా ఒక బోయవాడు స్వామి వారి కి ప్రార్తిస్తున్నాడట . ఆ రోజు నుంచి బోయ వంశానికి చెందినవల్లె ఈ దేవాలయం లో బ్రాహ్మణులతో పాటు అర్చకత్వం చేస్తున్నారు అని స్థల పురాణం .


ఈ దేవాలయం కు సమీపం లోనే శివాలయం మరియ రామాలయం కూడా ఉన్నయి. కృష్ణమ్మా గల గల పారే ఈ క్షేత్రం చూడడానికి చాల అందంగా ఉంటుంది.గర్భాలయం లో ఉన్న 8 అడుగుల స్వామి వారి విగ్రహం తేజోవంతంగా ,ఎంతో శక్తివంతమైనది అని చెబుతారు . ఆలయం లో ఉన్న ధ్వజ స్థంబం ,ముఖ మండపం చాల రమణీయంగా ఉంటాయి.


ప్రతి 12 సంవత్సరాలు ఒక సరి జరిగే పుష్కరలప్పుడు ఇక్కడికి బక్త జనాలు చాలామంది వస్తారు .
ప్రత్యేక కార్యక్రామాలు :

ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ,నృసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు . ప్రతి నిత్యం ఆకూ పూజ ,పంచామృత అభిషేకం చేస్తారు .
ఈ క్షేత్రాన్ని సందర్శించి ,కృష్ణ నది లో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటే సకల రోగాలు , పాపాలు హరిస్తాయని భక్తుల విస్వాశం.