info.manatemples@mail.com

+91 9866933582

ఆంజనేయ స్వామి దేవాలయం -చింతరేవుల




కృష్ణ నది తీరంలో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ కి దగ్గర లో లో పెద్ద చింతరేవుల గ్రామం లో ఉన్న ఆంజనేయ స్వామి ఎక్కడెక్కడినుంచో వచ్చే బక్తుల చింతలు తీరుస్తాడు అని నమ్మకమ్.బాగా మహిమన్మితమైన శక్తివంతమైన క్షేత్రం ఇది . ఇక్కడి స్వామికి ' భీమారాయాంజనేయుడు ' అని పేరు. ఇక్కడ స్వామి వారు ముక్కోపిగా ఉన్నారు అని గతం లో శ్రీ వ్యాసరాయలు ఈ స్వామి కి యంత్రం తాయారు చేసి విగ్రహం ప్రతిష్టించినట్లు పురాణాలూ చెబుతున్నాయి .


శేసప్ప అనే పట్వారి గద్వాల సంస్థానం లో పని చేసే వాడు .ఎన్నో అవమానాలకు గురి అయ్యి చివరకు ఈ ప్రాంతం వచ్చి తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడట .ఈ ప్రాంతం అంత చింత చెట్ల సముహంతో నిండి పోయి ఎటు చుసిన పుట్టలు ఉండేవి.శెసప్ప ఒక పుట్టలో చేయి పెట్టి అత్మత్యగానికి సిద్దపడ్డాడు . అప్పుడు ఒక పుట్టలో రాయి చేతికి తగలగా శేసప్ప చేయి పైకి తిసేసుకున్నాడట.


ఒక్క పాము కూడా కాటు వేయలేదు ... ఆ రోజు శేసప్ప అక్కడే నిద్రపోగా స్వామి వారు స్వప్నం లో వచ్చి తను పుట్టలో ఉన్నాను అని ,దానిని బయటకు తీసి పూజలు చేయమని ఆదేశించాడు . వెంటనే శేసప్ప కృష్ణ నది లో స్నానం ఆచరించి స్వామి వారికి పూజ,అభిషేకాలు నిర్వహించాడు అని స్థల పురాణం .



ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ తదియ నుండి మాఘ సప్తమి వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి అమావాస్య రోజు మరియు దసరా పండుగ రోజుల్లోనూ ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి అమావాస్య రోజు ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది.
రక రకాల బాధలు ,అనారోగ్యలతో ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకొని వెళ్తారు . భక్తుల కోరికలు,చింతలు తీర్చే కొంగు బంగారం చిన్తారేవుల ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్కరు దర్శించవలసిన రమణీయ క్షేత్రం ఇది . గద్వాల్ పట్టణానికి అతి చెరువులో ఉన్న ఈ క్షేత్రాన్ని మనమంతా చూసి ధన్యులము అవుదము !!