info.manatemples@mail.com

+91 9866933582

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -వాడపల్లి




కృష్ణ ,ముసి నదులు కలసే ఈ సంగం ప్రదేశం లో వెలసిన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం చాల పురాతనమైనది మరియు మహిమన్మిథమైనది. మిర్యాలగూడ నుండి 26 కి మీ దూరం లో వాడపల్లి గ్రామం ఉంటుంది .


వ్యాస భగవానుడు చాల సంవత్సరాలు ఇక్కడ గోరమైన తపస్సు చేసాడని, మహావిష్ణువు నరసింహ అవతరం లో ప్రత్యక్షమై కనిపించాడు అని ఆ తరువాత వ్యాసుని కోరికు మన్నించి స్వామి వారు ఇక్కడే కొలువై ఉన్నారు అని స్థలపురాణం . హిరణ్యకసపుడిని సంహరించి ఈ ప్రాంతం లో ఆగ్రహం తో సంచరించాడని ఆ సమయం లోనే వ్యాసులవారికి స్వామి దర్శనమిచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు అని స్థల పురాణం చెబుతుంది . స్వామి వారి దివ్య మంగళ రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు .స్వామి వారి దర్శనం కలిగించడానికి దేవాలయ అధికారులు రెండు దీపాల సదుపాయం కలిపిస్తారు . ఒక దీపం తో స్వామి వారు దివ్యమంగల రూపాన్ని చూపిస్తారు. ఇక్కడ స్వామి వారి భక్తుల కోరికలు ,ఆపదలు ,కష్టాలు తీరుస్తాడని భక్తుల బలమైన నమ్మకం .


ఈ గ్రామం లోనే వెలసిన మరో అద్బుతమైన ,రమణీయమైన క్షేత్రం అగ్యస్తేస్వర స్వామి దేవాలయం . సుమారు 12 వ శతాబ్దం లో కాకతీయుల కాలం లో నిర్మించారు .


స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట .
ప్రత్యేక కార్యక్రామాలు :
వైకుంటా ఏకాదశి కి ,నరసింహ జయంతి కి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించబడును .


వెళ్ళు మార్గం :
మిర్యాలగూడ నుండి 25 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది .