కర్నూల్ జిల్లలో వెలసిన మరోమహిమన్మితమైన క్షేత్రం రాఘవేంద్ర స్వామి దేవాలయం . కాంచి
పట్టణానికి 26 మైళ్ళ దూరం లో గల భువనగిరి లో క్రి శ 1598 లో వెంకట బట్టు అనే బాలుడు
జన్మించాడు . ఆయనే పెరిగి పెద్దవాడు అయి శ్రీ రాఘవేంద్ర స్వామి గ ప్రసిద్ది చెందాడు
.
అయన సజీవంగా సమాధిలోకి ప్రవేశించి జీవ సామాది అయినారు ఆ సమాధినే రాఘవేంద్ర బృందావనం
అని పిలుస్తారు . తుంగభద్రా నది తీరాన వెలసిన ఈ క్షేత్రం ఎంతో మహిమన్మితమైనది .
మహాతపస్సంపంనుడు జమదగ్ని మహర్షి, ఆయన బార్య రేణుకాదేవి మంచాల దేవతగా ఇక్కడ అవతరించింది
అని ఆమె పేరు మీదే గ్రామానికి మంచాల అని స్థిరపడింది అని ఆ తరువాత అది మంత్రాలయ క్షేత్రంగా
ప్రసిద్ది చెందింది అని స్థల పురాణం .
బృందావనం వెలసిన చోటే పూర్వం బక్త ప్రహలధుడు యజ్ఞం చేసాడని ,అతడే కలియుగం లో రాఘవేంద్ర
స్వామి గ జన్మించాడని, విజయ నగర సామ్రాజ్యదినేత శ్రీ కృష్ణ దేవరల మత గురువు ఆయన శ్రీ
వ్యాసరాయల వారే రాఘవేంద్ర స్వామి అని చెబుతుంటారు . తనను దర్శించిన బక్తుల కోరికలు
తీర్చటమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని , సిరి సంపదలను కలగచేస్తారు రాఘవేంద్ర స్వామీ
.
శ్రవణ బహుళ ద్వితియనాడు ఆరాధనా ఉత్సవం జరపబడుతుంది .